English | Telugu

నన్నపనేని రాజకుమారికి గాయాలు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, ఏపీ మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారికి గాయాలయ్యాయి. గుంటూరు జిల్లా తెనాలిలోని ఆమె నివాసంలో కాలు జారి కింద పడ్డారు. దీంతో నన్నపనేని తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చెకప్ చేయించుకున్న అనంతరం ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో నన్నపనేని చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీ నేతలు.. నన్నపనేనిని ఆరోగ్యం గురించి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరా తీస్తున్నారు.