English | Telugu
టీడీపీకి షాకిచ్చిన మరో ఎమ్మెల్యే!!
Updated : Dec 30, 2019
టీడీపీకి మరో షాక్ తగిలింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి.. ఆయన సోమవారం సీఎం జగన్‌ను కలిశారు. అమరావతి నుంచి రాజధాని తరలించడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాజధానికి భూములిచ్చిన రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఆ పార్టీని వీడుతుండటం గమనార్హం.
ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైసీపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. వంశీ కొద్దిరోజులు క్రితం సీఎం జగన్ ని కలిసిన తర్వాత టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వైసీపీలో చేరనప్పటికీ.. టీడీపీకి దూరంగా ఉన్నారు. అసెంబ్లీలోనూ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ను కోరారు. ఇప్పుడు అదే బాటలో మద్దాలి గిరి పయనించనున్నారు. ముందు ముందు టీడీపీకి ఇంకెంతమంది ఎమ్మెల్యేలు షాకిస్తారో చూడాలి.