English | Telugu
మరో వివాదంలో కూన రవి.. లేపేస్తానంటూ వైసీపీ నేతకు ఫోన్ లో వార్నింగ్
Updated : Jun 27, 2020
అయితే, తనపై వస్తున్న ఆరోపణలను కూన రవికుమార్ ఖండించారు. పొందూరులో ఉన్నది జాయింట్ ప్రాపర్టీ అని వివరణ ఇచ్చిన కూన.. టీడీపీ ఆఫీసు బిల్డింగ్‌పై ఇద్దరికీ హక్కు ఉందని స్పష్టం చేశారు. నాకు చెప్పకుండా ఆఫీసు రంగులను ఎలా మారుస్తారు? అని ప్రశ్నించిన ఆయన.. మర్యాదతక్కువ పనులు చేయొద్దని మాత్రమే చెప్పానని అన్నారు.
కాగా, ఇటీవల కూన రవి కుమార్ ఓ ఎమ్మార్వోను ఫోన్ లో దూషించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు కూడా నమోదైంది. ఇలా వరుసగా ఆయన ఫోన్ లో వార్నింగ్ లు ఇస్తున్న ఆడియో క్లిప్ లు బయటకు రావడం చర్చనీయాంశమైంది.