English | Telugu
ఏపీలో పరిస్థితుల పై మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు
Updated : Jun 18, 2020
గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడును కలవడానికి అనుమతి లేకపోవడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసి అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నామని రామానాయుడు అన్నారు. ఆపరేషన్ జరిగి 24 గంటలు కూడా గడవకుండానే ఆయను కారులో కూర్చోబెట్టి 6 వందల కి.మీ. ప్రయాణం చేయించడంతో మళ్ళీ బ్లీడింగ్ అవుతోందని, కంట్రోల్ కావడంలేదని చెప్పారని, దానితో నిన్న మళ్లీ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారన్నారు. ప్రస్తుతం అచ్చెన్న ఆరోగ్యం నిలకడగానే ఉందని సూపరింటెండెంట్ చెప్పారని తెలిపారు. బీసీ నేత అయిన అచ్చెన్నను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసిందని రామానాయుడు అన్నారు.