English | Telugu

కడప లో మ‌రో స్టీల్ ప్లాంట్!

కడప జిల్లాలో 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో భారీ స్టీల్‌ ప్లాంట్‌ పెట్టడానికి ప్రముఖ స్విస్‌ కంపెనీ ఐఎంఆర్‌ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.

ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్‌ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతోపాటు విద్యుత్, ఉక్కు కర్మాగారాలను నడుతున్నామంటూ ఐఎంఆర్‌ కంపెనీ ప్రతినిధులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.

కృష్ణపట్నం పోర్టు, అక్కడ నుంచి రైల్వే మార్గం, జాతీయ రహదారులతో రవాణా సదుపాయం ఉందని వారికి వివరించారు. రానున్న రోజుల్లో వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రాంతం స్టీల్‌ సిటీగా రూపాంతరం చెందడానికి పూర్తి అవకాశాలు న్నాయని కంపెనీ ప్రతినిధులు వ్యాఖ్యానించారు.

ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. నీరు, కరెంటు, మౌలిక సదుపాయాలు.. ఇలా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్పారు.

సమావేశంలో చీఫ్‌ సెక్రటరీ నీలం సహానీ, ఇండిస్టీస్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్‌, ఐఎంఆర్‌ ఎజి చైైర్మన్‌ హాన్స్‌ రడాల్ఫ్‌ వైల్డ్‌, కంపెనీ డైరెక్టర్‌ అని ర్యుధ్‌ మిశ్రా, సెడిబెంగ్‌ ఐరన్‌ ఒర్‌ కంపెనీ సిఇఒ అనీష్‌ మిశ్రా, గ్రూప్‌ సిఎఫ్‌ఒ కార్ల్‌డిల్నెర్‌, టెక్నికల్‌ డైరెక్టర్‌ సురేష్‌ తవానీ, ప్రా జెక్ట్స్‌ ప్రెసిడెంట్‌ అరిందమ్‌ దే, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ సంజరు సిన్హా, ఎపి ఇంటిగ్రేటెడ్‌ స్టీల్స్‌ ఎమ్‌డి పి.మధుసూదన్‌ పాల్గొన్నారు.