English | Telugu
స్వరూపానంద 'శార్వరి ' నామ ఉగాది శుభాకాంక్షలు
Updated : Mar 24, 2020
ప్రధాని మోడీ, తెలుగు రాష్ట్రాల సీఎంల సూచనలు పాటిస్తూ ఏప్రిల్ 15 వరకు జాగ్రత్తగా ఉండాలని విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి సూచించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు శార్వరి నామ ఉగాది సందేశం అందచేసిన స్వామి స్వరూపానందేంద్ర, ఉగాది వేడుకల కోసం ఎవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉండి పండుగ జరుపుకోవాలనీ, దారుణమైన విపత్తు తొలగిపోవాలని దేవుని ప్రార్ధించాలనీ, రాజశ్యామల అమ్మవారి అనుగ్రహంతో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాననీ స్వామి స్వరూపానందేంద్ర తన సందేశం లో పేర్కొన్నారు.