English | Telugu

భారత్- చైనా సరిహద్దులో ఘర్షణ.. అమరుడైన తెలుగుబిడ్డ

భారత్, చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన ఓ సైనికాధికారి, ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికాధికారి కల్నల్ సంతోష్ బాబు తెలుగువాడే. సంతోష్ తెలంగాణలోని సూర్యాపేట వాసి. సంతోష్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

బీహార్ 16వ బెటాలియన్ కు చెందిన సంతోష్.. ఏడాదిగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. సంతోష్ కు ఇటీవలే హైదరాబాద్ రెజిమెంట్ కు బదిలీ అయింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చే లోపే ఆయన అమరుడు కావడం విషాదకరం. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.