English | Telugu

ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి అమిత్ షా అపాయింట్మెంట్.. త్వరలో వైసీపీలో చీలిక?

వైసీపీ రెబల్ ఎంపీగా మారిన ఎంపీ రఘురామ కృష్ణమరాజు అటు మాటలతోనూ, ఇటు చేతలతోనూ వైసీపీని తెగ ఇబ్బందిపెడుతున్నారు. తాజాగా, ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది అనే అంశం వైసీపీ నేతలను షాక్ కి గురిచేసింది. సీఎం జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడని అమిత్ షా ఒక వైసీపీ ఎంపీకి అవకాశం ఇవ్వడం ఆ పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు.

మొదటి నుంచి బీజేపీ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణమరాజు మరో సారి తన సత్తా ఏంటో వైసీపీ కి తెలియజేయాలి అనుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా జగన్ ఏడాది పాలనలో స్యాండ్, ల్యాండ్, వైన్ మాఫియా తో సహా కుల రాజకీయాలను ఎండగట్టిన ఆయన ఈ సారి పార్టీకి భారీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం సొంత కులానికి చెందిన నేతతో వైసీపీ పొమ్మన లేక పొగబెడుతుంది అనే ఆలోచనకు రఘురామ కృష్ణమరాజు వచ్చారని ఆయన సన్నిహితులు అంటున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయానికి ధీటైన జవాబు ఇవ్వాలని రఘురామ కృష్ణమరాజు భావిస్తున్నారట.

రఘురామ కృష్ణమరాజు దెబ్బకి త్వరలో ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరగబోతున్నాయని, ఆయన వైసీపీకి గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. వైసీపీ పేరుకుపోయిన ఒకే సామాజిక వర్గ కోటరీ దెబ్బకి పదుల సంఖ్యలో నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి రఘురామ కృష్ణమరాజు తిరుగుబాటు చేస్తారని, అందుకు ఆయన కార్యాచరణ కూడా మొదలుపెట్టారని అంటున్నారు. సౌత్ ఇండియా లో అందులోనూ ముఖ్యంగా ఏపీలో బలపడాలనేది బీజేపీ ఆశ. అందుకే, ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని, త్వరలోనే ఏపీ లో బీజీపీ జెండా ఎగిరేలా చెయ్యాలనే ఆలోచన తో ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి ఆగమేఘాల పై అపాయింట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.