English | Telugu

గచ్చిబౌలిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

కంపెనీ నుండి నోటీసులు వచ్చాయి.. ఉద్యోగం పోతుందన్న మనస్థాపంతో మరో మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ మాదాపూర్ గోల్డెన్ హిల్స్ క్యాప్టల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హరిణి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంది. గచ్చిబౌలిలోని వెంకటేశ్వర ఉమెన్స్ హాస్టల్ లో ఉంటుంది. నెల నెలా ఇంటికి డబ్బులు పంపుతూ.. తన కాళ్ళ మీద తను నిలపడుతుంది. ఈ క్రమంలో కంపెనీ ఆమెతో పాటు మరికొంతమందికి కూడా నోటీసులు ఇచ్చింది. వచ్చే నెలతో ఉద్యోగం పోతుందని తీవ్ర మనస్థాపానికి గురైన హరిణి హాస్టల్ రూంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హరిణి నిన్న రాత్రి సూసైడ్ చేసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే దానికి కారణాలు మాత్రం కంపెనీకి సంబంధించినటువంటి నోటీస్ రావటమేనని అంటున్నారు.ఎప్పటిలానే ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో చాలామంది ఉద్యోగులను తొలగిస్తూ ఉంటారు.. అదే సమయంలో హరిణికి సంబంధించి కూడా నోటీస్ ఇచ్చారు. ఆమె ఒక్క దానికే కాదు దాదాపు 25 మందికి నోటీసులు ఇచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. నిన్న ( నవంబర్ 20న ) రాత్రి ఆమె 8 గంటల 30 నిమిషాల సమయంలో ఆమె హాస్టల్ కు వచ్చి హాస్టల్ లో ఉరేసుకున్నట్టుగా హాస్టల్ నిర్వాహకుల ద్వారా సమాచారం తెలిసింది.

హాస్టల్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిజంగానే ఆమెకు ఈ నోటీస్ ఎప్పుడు ఇచ్చారు. నోటీస్ ఆమె ఒక్కదానికే ఇచ్చారా లేదంటే మిగతా వాళ్ళకి కూడా ఇచ్చారా అన్న విషయం పై పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం.. ఆమెతో పాటు 25 మందికి పైగా నోటీసులు ఇచ్చినట్లు తేలింది. కాబట్టి ఆమె సూసైడ్ కి అదే కారణమా లేదంటే ఇంకా వేరే ఏదైన కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.