English | Telugu

టిటిడి తరహాలో శబరిమలలో బోర్డు ఏర్పాటు చెయ్యాలి :- సుప్రీం ఆదేశం

శబరిమలపై కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీటీడీ తరహాలో శబరిమల బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక చట్టాన్ని తయారు చేయాలని కేరళ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఆ చట్టాన్ని తీసుకురావటానికి 4 వారాల గడువి ఇచ్చింది సుప్రీంకోర్టు. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని సూచించింది. గడువు లోగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. మహిళలపై ఎలాంటి నిషేధం లేదని అన్ని వయసుల వాళ్ళు స్వామిని దర్శించుకోవచ్చుని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మహిళల ప్రవేశంలో గతంలో ఇచ్చిన జడ్జిమెంటే అమల్లో ఉంటుందని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. కేరళ ప్రభుత్వం ఇప్పడు ఖచ్చితంగా సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయక తప్పదు. నిజానికి అక్కడ ఒక బోర్డ్ ని ఏర్పాటు చేసి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక చట్టాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలంటూ గతంలోనే ఆదేశాలిచ్చింది.

సుప్రీం ఆదేశాలను ఇప్పటి వరకు కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. దానితో ఈ రోజు ( నవంబర్ 20న ) సుప్రీం కోర్ట్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే శబరిమలలో ఒక బోర్డు ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. లక్షలాది సంఖ్యలో వచ్చే భక్తులకు సంబంధించి సదుపాయాల కల్పన విషయంలో.. అడ్మినిస్ర్టేషన్ విషయంలో.. మరే విషయంలో అయినా బోర్డు ఉండటం మంచిదన్న అభిప్రాయానికి వచ్చింది. అది కూడా టీటీడీ తరహాలో ఆ బోర్డుకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఐఏఎస్ అధికారి ఉంటే వాటి నిర్వహణ అన్నీ సక్రమంగా ఉంటాయన్న అభిప్రాయం.