English | Telugu
'సైరా' క్రేజ్ తో చిక్కుల్లో పడ్ద పోలీసులు...
Updated : Oct 2, 2019
సైరా సినిమా చూసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకున్న ఆరుగురు ఎస్సైలను, ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు అక్కడ ఉన్నతాధికారులు. కేవలం సినిమా చూస్తేనే శిక్ష ఉంటుందా అనుకోవచ్చు కానీ బందోబస్తుకు పంపిన పోలీసులు ఆ పని వదిలేసి సినిమాకూ పరుగులు తీస్తే చర్యలు తీసుకోమా అంటున్నారు అధికారులు. అవుకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఐఎస్ఐ జగదీశ్వరెడ్డి, నందివర్గం ఐఎస్ఐ హరిప్రసాద్, బండి ఆత్మకూర్ ఎస్ఐ వెంకట సుబ్బయ్య, రాచర్ల ఎస్ఐ ప్రీతంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ అశోక్ ను ఎస్పీ ఆఫీస్ కు తరలించారు. బందోబస్తుకి పంపితే ఈ ఆరుగురు ఎస్ఐలు కోయిల కుంట్లలోని ఒక ఫంక్షన్ హల్లో విందు ఆరగించి సైరా నరసింహా రెడ్డి సినిమాకు వెళ్ళారు. డ్యూటిని వదిలి పెట్టి సినిమా చూశారనే దానిపై విచారణ జరుగుతుంది అందరూ కూడా తన దగ్గరకు వచ్చి ఈ రోజు వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు ఎస్పీ .ఈ విచారణ తర్వాత వారి పై చర్యలు తీసుకుంటారా లేకుంటే క్షమాపనలతో సరిపెడతారా అనేది తేలాల్సి ఉంది. ఎస్పీ దీనిపై స్పందిస్తూ ఎవరైన సినిమా చూస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ సెలవ పెట్టకుండా ఎవ్వరికీ చెప్పకుండా విధులు పక్కన పెట్టి సినిమా చూడటం అనేది చాలా తప్పు ఇది ప్రజలలో చాలా తప్పుడు సమాచారం తీసుకువెళ్తుందనేది తమ ఉద్దేశం అని వారు తెలియజేశారు. ప్రస్తుతం అయితే ఎస్పి దగ్గర విచారణ జరుగుతుంది. ఆరుగురు ఎస్ఐలు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ తరువాత ఏమి జరుగుతుంది అనేది తేలాల్సి ఉంది.