English | Telugu

సైంటిస్ట్ సురేష్ ను అతి దారుణంగా హత్య చేయడానికి కారణం ఏమిటి?

సైంటిస్ట్ సురేష్ హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఈ హత్య కేసులో శ్రీనివాస్ అనే వ్యక్తిని పోలీసులు అనుమానిస్తున్నారు. సురేష్ తో ఉన్న సంబంధాల కారణంగానే శ్రీనివాస్ హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలు శ్రీనివాస్ కోసం గాలిస్తున్నాయి. సైంటిస్టు సురేష్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. రెండు నెలలుగా సురేష్ ఇంటికి వచ్చి వెళ్తున్న శ్రీనివాస్ పైనే ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాస్ కోసం మూడు పోలీసు బృందాలు గాలింపు నిర్వహిస్తున్నాయి.

శాస్త్రవేత్తగా పని చేస్తున్న సురేష్ కుమార్ హత్య జరిగి నలభై ఎనిమిది గంటలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. అతను అన్నపూర్ణ అపార్ట్ మెంట్స్ లోని ఎస్2 ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం అతను కేరళ నుండి హైదరాబాద్ కు వచ్చి అప్పటి నుండి కూడా అతను నేషనల్ సెంచరీ రిమోట్ సెంటర్ లోనే పని చేస్తూ ఉన్నాడు. అతని భార్య వృత్తిరిత్యా బ్యాంకు మేనేజర్ కావడంతో ప్రస్తుతం ఆమె బెంగళూరులో జాబ్ చేస్తుంది. సురేష్ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్లంతా కూడా వాళ్ల వాళ్ల ఉద్యోగరీత్యా వాళ్లు ఉంటున్నారు. సురేష్ కుమార్ ఒక్కడు మాత్రమే ఎ2 లో నివాసముంటున్నాడు. సోమవారం నాడు అతను ఆఫీస్ కి రాలేదు రాకపోవటంతోటి వెంటనే అక్కడ ఉన్నవాళ్లంతా అతను పని చేస్తున్న నేషనల్ సెన్సింగ్ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన ఉద్యోగులు వెంటనే ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ రావడంతోటి అతను వెంటనే అతని కుటుంబ సభ్యుల సమాచారమందిచడంతో మంగళవారం నాడు అతని భార్య అక్కడకు చేరుకున్నారు. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసి వచ్చిన తరువాత తాళం తీసి చూసే సరికి అప్పటికే అతను విగతజీవిగా రక్తస్రావంలో పడి ఉన్నాడు. తలకు బలమైన గాయం జరిగింది. అందుకోసమే అతను చనిపోయినట్లు కూడా ప్రస్తుతమైతే పోలీసులు భావించడం జరుగుతుంది. అయితే హత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. తలకు బలమైన గాయమైంది అనేది ఒకటి తెలుస్తుంది. మరొకవైపు గత కొద్ది కాలంగా ఒక యువకుడు ఇక్కడకు వస్తున్నాడు అని పోలీసులు సమాచారం సేకరించారు. ప్రస్తుతం అపార్టుమెంట్ లో మాత్రం ఎక్కడ సీసీ కెమెరాలు లేకపోవటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది.