English | Telugu

సితార బోల్డ్ మూవీ.. డైమండ్ ని పక్కన పెట్టేశారా?

"If middle finger was a man" అంటూ తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలను జూలై 9న రివీల్ చేస్తామని తెలిపింది. ఇదొక సినిమా అనౌన్స్ మెంట్ అని అర్థమవుతూనే ఉంది. అయితే అది ఏ సినిమా అనేదే ఇక్కడ ఆసక్తికరం.

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డతో మరో సినిమాకి శ్రీకారం చుట్టింది సితార. రవికాంత్ పేరేపు డైరెక్ట్ చేయనున్న ఈ ఫిల్మ్ కి 'బ్యాడాస్' (BADASS) అనే టైటిల్ ను లాక్ చేసినట్లు సమాచారం.

నిజానికి సిద్ధు-రవికాంత్ కాంబినేషన్ లో గతేడాది 'కోహినూర్' అనే సినిమాని ప్రకటించింది సితార సంస్థ. 'కోహినూర్' డైమండ్ కథ నేపథ్యంలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలి అనుకుంది. కానీ, ఎందుకనో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టారు. ఇప్పుడు అదే కాంబోలో 'బ్యాడాస్' సినిమా రాబోతుంది. ఇది సినిమా(సినీ పరిశ్రమ) గురించి తీస్తున్న సినిమా కావడం విశేషం. ఈ మూవీ బోల్డ్ గా ఉంటుందని టాక్. కాగా, గతంలో సిద్ధు-రవికాంత్ కాంబోలో 'కృష్ణ అండ్ హిజ్ లీలా' అనే సినిమా వచ్చింది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.