English | Telugu

ప్రముఖ నటి ఝాన్సీ మృతి.. కారణం ఇదే  

దర్శక దిగ్గజాలు బాపు (Bapu)విశ్వనాధ్(k. Viswanath)తెరకెక్కించిన 'ముత్యాల ముగ్గు', శంకరా భరణం, మనవూరి పాండవులు,పెళ్లి పుస్తకం లాంటి సినిమాలకి తెలుగు చిత్ర పరిశమ్రలో ఎప్పటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సినిమాల్లో కథకి చాలా కీలకమైన పాత్రలని పోషించి ప్రేక్షకులని మెప్పించిన నటి ఝాన్సీ(Jhansi). 1960 వ దశకంలోనే సినీ రంగ ప్రవేశం చేసిన ఝాన్సీ తన కెరీర్ లో సుమారు ఐదు వందల సినిమాల్లో పలు రకాల క్యారెక్టర్స్ ని పోషించింది. భానుమతి, సావిత్రి లాంటి లాంటి మహా నటీమణులకి తల్లిగాను నటించిన ఝాన్సీ కి గయ్యాళి, ఈర్ష్య తో కూడిన పాత్రలు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

రీసెంట్ గా ఝాన్సీ నిన్న విజయవాడ లో తనువు చాలించారు. వయసు పై పడటంతోనే ఆమె చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్ ఇలా అందరి హీరోల సినిమాల్లోనూ నటించింది. ఒక్క అక్కినేని నాగేశ్వరరావుతో సుమారు 100 సినిమాల్లోదాకా నటించి ఒక రికార్డు ని కూడా క్రియేట్ చేసిందని చెప్పవచ్చు.

చివరిసారిగా నందమూరి హరికృష్ణ, వైవీఎస్ చౌదరి కాంబోలో వచ్చిన హిట్ మూవీ 'సీతయ్య' లో విలన్ క్యారక్టర్ ముకేశ్ రుషి కి తల్లిగా నటించింది. కృష్ణా జిల్లా గుడివాడ ఆమె స్వస్థలం. సిద్ధి వినాయక పిక్చర్స్ అనే సంస్థని నెలకొల్పి సుమన్, రంభ, మహేశ్వరీ హీరో హీరోయిన్లుగా బి గోపాల్ దర్శకత్వంలో 'ఖైదీ ఇన్స్పెక్టర్' అనే మూవీని నిర్మించిండంతో పాటు కొన్ని చిత్రాలకి ఫైనాన్సియర్ కూడా పని చేసింది. ఆమె మృతి పట్ల తెలుగు చిత్ర నిర్మాత మండలి తో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేసారు.


ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.