English | Telugu
' షార్ ' నుంచి ఈ నెలాఖరు వరకూ రాకెట్ ప్రయోగాలు లేవు
Updated : Mar 23, 2020
కరోనా దెబ్బకు రాకెట్ సైతం కుదేలైంది . రాకెట్ ప్రయోగాలను ఈ నెల 31 వరకూ సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం స్తంభింప చేసింది. కోవిడ్- 19 వ్యాప్తి నివారణ కోసం ఈ నెల 31 వరకూ షార్‌ను షట్ డౌన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.అత్యవసర విభాగాల ఉద్యోగులు మాత్రం షిఫ్టులకు హాజరయ్యేలా ఆయా విభాగాధిపతులు ఏర్పాట్లు చేసుకోవాలని సర్క్యులర్ జారీ చేశారు. షార్ ఉద్యోగులకు సంబంధించిన జనరల్ షిఫ్ట్ బస్సులను రద్దు చేశారు. షార్‌లో జరుగుతున్న నిర్మాణ పనులను సైతం అధికారులు నిలిపివేశారు.