English | Telugu
ఇంట్లో ఉన్నంత మాత్రాన కరోనా రాదా?
Updated : Mar 23, 2020
- ఇంట్లో ఉన్నా కూడా.. కూరగాయలు, పాలు మరియు కొన్ని నిత్యావసరాలు బయట నుండి తెచ్చుకునే అవకాశముంది. కావున, కూరగాయలు శుభ్రంగా కడగాలి. పాల ప్యాకెట్ కూడా చేతులకి గ్లౌజ్ వేసుకొని తాకాలి. కొందరికి పాల ప్యాకెట్ ని నోటితో కత్తిరించే అలవాటు ఉంటుంది. అలా కాకూండా, చాకు లేదా కత్తెరతో కత్తిరించాలి.
- రోజుకి రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయాలి.
- వీలైనన్ని సార్లు చేతులు శుభ్రంగా సబ్బుతో కడగాలి.
- ఉతికిన బట్టలనే ధరించాలి.
- ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
- ఇంట్లో ఉన్నా సరే.. తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు.. కర్చీఫ్ లేదా టిష్యూ అడ్డుపెట్టుకోవాలి.ఒకవేళ చేతిని అడ్డుపెట్టుకుంటే వెంటనే శుభ్రం చేసుకోవాలి.
- న్యూస్ పేపర్ అలవాటు ఉన్నవారు కొన్నిరోజుల పాటు ఆ అలవాటుని మానుకుంటే మంచిది. లేదా చేతికి గ్లౌజులు వేసుకొని పేపర్ తాకాలి.
- ఇలా ఇంట్లో ఉన్నా సరే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయట నుండి తెచ్చుకునే వస్తువులను తాకేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అప్పుడే వైరస్ బారిన పడకుండా ఉంటాం.