English | Telugu

జగన్మోహన్ రెడ్డిపై... షకీలా సెన్సేషనల్ కామెంట్స్

షకీలా. పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు శృంగార దేవతగా కుర్రాళ్ల గుండెల్లో నిలిచిన తార. ఇప్పటికీ పోర్న్‌ స్టార్‌గా యూట్యూబ్‌లో చెక్కుచెదరని పేరు. అందుకే, షకీలాకు భాషాభేదం లేకుండా శృంగారాభిమానుల్లో పేరుంది. అన్ని భాషాల్లోనూ షకీలాకు వీరాభిమానులున్నారు. మళయాళ చిత్రసీమను ఒక ఊపు ఊపిన చరిత్ర ఆమెది. మమ్ముట్టి, మోహన్‌లాల్‌ను సైతం గడగడలాడించిన బాక్సాఫీసు రికార్డులు ఆమె సొంతం. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ షకీలా అంటే తెలియనివాళ్లే ఉండరు. పోర్న్ మూవీలోనే కాకుండా పలు తెలుగు చిత్రాల్లో షకీలా నటించి మెప్పించింది. అయితే, షకీలా తాజాగా పేల్చిన డైలాగ్సే ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ అభిమానులకు మంట పుట్టిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూడు రాజధానులపై షకీలా సెటైర్లు పేల్చారు. అయితే, ఈ సెటైర్లు డైరెక్ట్ గా వేయలేదు. తన లేటెస్ట్ సినిమా ట్రైలర్ లో ఏపీ మూడు రాజధానుల నిర్ణయంపై పంచ్ లు పేల్చింది. షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో షకీలా చేత ఈ డైలాగ్స్ చెప్పించారు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో షకీలా పేపర్‌ చదువుతూ ఉంటుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులంటూ వచ్చిన వార్తను చదువుతూ ....ఏంటి? ఏపీకి మూడు రాజధానులా? అంటూ తన అసిస్టెంట్‌ని అడుగుతుంది. అవును మేడం! జగనన్న మూడు రాజధానులు చేశాడు కదా అంటూ అసిస్టెంట్‌ సమాధానం చెప్తాడు. అయితే, ఇక్కడే మూడు రాజధానులపై షకీలా చేత సెటైర్లు వేయించాడు దర్శకుడు. ఏంటీ ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధానులా అంటూ ప్రశ్నించిన షకీలా....పోను పోనూ ఒక్క రాష్ట్రానికి ముగ్గురు ముఖ్యమంత్రులైనా ఆశ్చర్యం అవసరం లేదంటూ సెటైర్ వేసింది. అయితే, ఈ మూవీ డైరెక్టర్ కావాలనే సినిమాలో ఈ డైలాగ్ చెప్పినట్లు కనిపిస్తోంది. పైగా ఆ డైలాగ్ ను షకీలా చేత చెప్పించి వివాదానికి తెరలేపాడు. దాంతో ఈ మూవీ ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది.

ఈ సినిమా కథ షకీలానే రాశారని చెబుతున్నారు. అంటే ఈ డైలాగ్‌ కూడా షకీలా అభిప్రాయమే అనుకోవాలి. అంటే, షకీలాకు మూడు రాజధానులు ఇష్టంలేదన్న మాట. మరి సినిమాలో పొలిటికల్‌ డైలాగ్స్‌ వెయ్యాలంటే, అందులోనూ అధికారంలో వున్న పార్టీకి వ్యతిరేకంగా వివాదాస్పద సన్నివేశాలు పెట్టాలంటే, ధైర్యముండాలి. ఈ విషయంలో షకీలా సాహసం చేశారని సినిమా ప్రేక్షకులంటున్నారు. అయితే, కేవలం సినిమా పబ్లిసిటీ కోసమే షకీల మూడు రాజధానులపై వివాదాస్పద సన్నివేశాలు, డైలాగ్స్ పెట్టి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కారణం ఏదైనా షకీల కొత్త సినిమా ట్రైలర్‌లో పంచ్‌లు, సోషల్ మీడియాలో వైసీసీ, టీడీపీ మధ్య అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. తెలుగుదేశం సోషల్ మీడియా ఫాలోవర్స్‌, షకీల్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. షేర్లమీద షేర్లు చేస్తూ, వైసీపీ మీద షకీల సైతం సెటైర్లు వేశారంటూ, కామెంట్లు చేస్తున్నారు. అయితే, షకీల ట్రైలర్‌పై వైసీపీ అభిమానులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు. టీడీపీ మెప్పు కోసమే, ట్రైలర్‌లో త్రీ క్యాపిటల్స్‌ను షకీల వ్యతిరేకించారని కౌంటర్ వేస్తున్నారు. చివరకు షకీలను సైతం, మూడు రాజధానుల వివాదంలో టీడీపీ లాగిందని, ఆమెతోనూ విమర్శలు చేయించే నీచమైనస్థాయికి దిగజారిందని వైసీపీ ఫాలోవర్స్ అంటున్నారు.