English | Telugu

మాజీ న్యాయమూర్తిపై సెక్షన్ 354 కేసు నమోదు

సింధూ శర్మ సంబంధించిన కేసులో ఒక కొత్త పరిణామం చోటుచేసుకుంది. మాజీ న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహన్ రావు తన కోడలిని దారుణంగా హింసించిన సంగతి తెలిసిందే.. సీసీటీవీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా అతనిపై ఐపిసి 354 సెక్షన్ ను జత చేయాలని సీసీఎస్ అధికారులు కోర్టును అభ్యర్దించారు. ఈ క్రమంలో కోర్టు కూడా జత చేయడానికి అనుమతించడం జరిగింది. ఇప్పటికే సింధుశర్మ ఫిర్యాదు మీద ఐపీసీ సెక్షన్ 493,323 మరియు డౌరీ అండ్ ప్రోహ్బిషన్ యాక్ట్ 406సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మహిళలతో ఆయన ప్రవర్తించిన విధానాన్ని అభ్యంతరకర విధానాల మీద ఈ 354 సెక్షన్ ని తీసుకోవటం జరిగింది. సింధుశర్మ తన అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడూ ఆమెని ఏ విధంగా చిత్రీహింసలకు గురిచేశారు..రాత్రి పూట ఆమెను బయటకు నెట్టివేసిన పరిస్థితి కానీ ఆస్పత్రిలో ఉన్నప్పుడు తన ఒంటి మీద ఉన్న గాయాలను అన్నింటిని సాక్ష్యాధారాల కింద కోర్టుకు అందించారు. అదే విధంగా సీసీఎస్ అధికారులు కూడా సింధుశర్మ ఇచ్చిన తాజా లేఖను కోర్టుకి అందచేయడంతో మొత్తానికీ జస్టిస్ నూతి రామ్మోహన్ రావు పై మరో కేసు కూడా నమోదు అయ్యింది.