English | Telugu

కామ‌పిశాచి టీచ‌ర్ అరాచ‌కాలు!

పాఠాలంటూ పిలిచి పైశాచికం
సందేహాలడిగితే ఇంటికి రమ్మంటాడు

అమ్మాయిల‌ పట్ల పైశాచికంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన సామ శరత్‌కుమార్ మూడేళ్లుగా వనపర్తి జిల్లాలోని ఓ గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. బాలికలు సందేహాలడిగితే ఇంటికి రమ్మనేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వారిపై అసభ్యంగా ప్రవర్తించేవాడు. విషయం ఎవరికీ చెప్పవద్దని భయపెట్టేవాడు.

ఒక బాలిక స్నానం చేస్తుండగా రక్తస్రావం కావడం చూసి తల్లి భయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు చెప్పడంతో హతాశురాలైన తల్లి ఏం జరిగిందని పాపను అడిగితే విషయం చెప్పింది.

వెంటనే పాఠశాలకు వెళ్లి యజమాన్యాన్ని నిలదీసి ఉపాధ్యాయుడి కోసం గాలింపు చేపట్టారు. కొల్లాపూర్‌ వెళ్లాడని తెలుసుకుని, అక్కడికి వెళ్లి పట్టుకుని తీసుకువచ్చారు.

గ్రామస్థులతా కలిసి ప్రశ్నించగా మద్యం మత్తులో తప్పుచేశానని అంగీకరించాడు. దీంతో అతడికి దేహశుద్ధి చేసి పోలీసుల‌కు అప్ప‌గించారు.

సీఐ సూర్యానాయక్‌ గోపాల్‌పేట పోలీస్ స్టేష‌న్‌లో అతణ్ని విచారించారు. మరి కొందరు బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించానని అతడు అంగీకరించాడు.