English | Telugu
వైరల్ గా మారిన పెద్ది.. ఆ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తుందా!
Updated : Aug 9, 2025
గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్'(Ram Charan)అభిమానులతో పాటు,ప్రేక్షకుల్లో 'పెద్ది'(Peddi)పై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. చరణ్ లుక్ తో పాటు టీజర్ అదిరిపోవడంతో, చరణ్ ఈసారి బ్లాక్ బస్టర్ ని అందుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిలింసిటీ(Ramoji Film City)లో జరుగుతుంది. చరణ్ తో పాటు మరికొంత మంది నటులపై ఒక ఫంక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన, కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం మేకర్స్ ఒక భారీ సెట్ ని కూడా నిర్మించడం జరిగింది.
రీసెంట్ గా 'పెద్ది'కి సంబంధించిన అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వినిపిస్తున్న విషయం తెలిసిందే. పెద్ది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే పక్కా మాస్ సబ్జెట్ కాబట్టి, స్పెషల్ సాంగ్ తప్పని సరి. ఈ సాంగ్ లో స్టార్ హీరోయిన్ 'సమంత'(Samantha)చేస్తుందనే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. సమంత, చరణ్ జోడిగా రంగస్థలంలో నటించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ కి మంచి పేరు రావడంతో పాటు, రంగస్థలం విజయాన్నిమరింత పెద్దదిగా మార్చింది.
ఆ ఇద్దరిపై చిత్రీకరించిన సాంగ్స్, సదరు సాంగ్స్ కి ఆ ఇద్దరు చేసిన డాన్స్ కి థియేటర్ కి విజిల్స్ మోగాయి. ఈ నేపథ్యంలో 'పెద్ది' లో సమంత స్పెషల్ సాంగ్ చేస్తుందనే న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి 'పెద్ది'ని అధికారకంగా అనౌన్స్ చేసినప్పుడే, సమంత కూడా 'పెద్ది'లో చేస్తుందనే వార్తలు వినిపించాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి పుష్పలో చేసిన స్పెషల్ సాంగ్ తర్వాత సమంత మళ్ళీ స్పెషల్ సాంగ్స్ లో చేయలేదు. ఇక పెద్ది లో జాన్వీ కపూర్(Janhvi Kapoor)హీరోయిన్ గా చేస్తుండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు,దివ్యేన్దు శర్మ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27 న విడుదల కానుంది. వృద్ధి సినిమాస్ తో కలిసి మైత్రి మూవీస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బుచ్చిబాబు సాన(Buchibabu Sana)దర్శకుడు.