English | Telugu

ఏళ్ళు గడిచే కొద్దీ యంగ్ అవుతున్నావు.. యాభై అంటే నమ్ముతారా

ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)బర్త్ డే. అభిమానులకి పండుగ రోజు. ఆగస్టు 9 1975 న జన్మించిన మహేష్ ఈ రోజుతో యాభై సంవత్సరాలని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు మహేష్ కి బర్త్ డే విషెస్ చెప్తున్నారు.

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi)ఎక్స్ వేదికగా స్పందిస్తు 'యాభైయ్యవ పుట్టిన రోజు శుభాకాంక్షలు మహేష్. తెలుగు సినిమా పరిశ్రమకి మీరు గర్వ కారణం.ఏళ్ళు గడిచే కొద్దీ యంగ్ అవుతున్నావు. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను అని ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ చిరు,మహేష్ అభిమానులని విశేషంగా ఆకర్షిస్తుంది. చిరు,మహేష్ ల మధ్య సుదీర్ఘ కాలం నుంచి మంచి అనుబంధం ఉంది. మహేష్ చాలా సందర్భాల్లో మాట్లాడుతు చిరంజీవి గారంటే నాకు చాలా గౌరవం, నా కెరీర్ కి ఇన్స్పిరేషన్. నా ప్రతి సినిమా రిలీజ్ రోజున, ఫస్ట్ ఫోన్ కాల్ చిరంజీవి గారి దగ్గర్నుంచే వస్తుంది. మూవీ ఎలా ఉందో రిజల్ట్ చెప్పేస్తారని మహేష్ చాలా సార్లు చెప్పాడు. వెంకటేష్(venkatesh),ఎన్టీఆర్(Ntr)తో పాటు ఇతర సినీ ప్రముఖులు కూడా 'ఎక్స్' వేదికగా మహేష్ కి బర్త్ డే విషెస్ చెప్పారు.

ఇక మహేష్ బర్త్ డే సందర్భాన్ని పురస్కరించుకొని అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న SSMB29'నుంచి ప్రీ లుక్ పోస్టర్ విడుదలైంది. సదరు పోస్టర్ లో మహేష్(ఫేస్ రివీల్ చెయ్యలేదు) శివభక్తుడని సూచించేలా మెడలో త్రిశూల రుద్రాక్ష మాల ధరించి ఉన్నాడు. శరీరంపై నెత్తుటి దార కనిపిస్తోంది. వస్త్రధారణ కూడా విభిన్నంగా ఉంది. ఈ ఒక్క పోస్టర్ తో మహేష్ ని రాజమౌళి(Ss Rajamouli)అత్యంత శక్తివంతంగా, మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో చూపించబోతున్నాడని అర్థమవుతోంది. ఫస్ట్ లుక్ నవంబర్ లో విడుదల కానుంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.