English | Telugu
మీరు చేయలేదు కాబట్టి మేమూ చేయం: సజ్జల
Updated : Apr 24, 2020
పుష్కరాల సమయంలో చంద్రబాబు వందల కోట్లు కాజేశారని, కరోనా కట్టడిలో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, గుజరాత్ నుంచి మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని, చంద్రబాబు తానే ఇంకా ముఖ్యమంత్రి అనే భావనలో ఉన్నారని, చంద్రబాబు పైత్యం పరాకాష్టకు చేరిందని, చంద్రబాబు సలహాలు ప్రభుత్వంకు అవసరం లేదని సజ్జల అన్నారు. " అఖిలపక్షం సమావేశం అడిగే అర్హత చంద్రబాబు కు లేదు. కరోనా పది రాజకీయ పార్టీలు సమావేశం పెట్టి చర్చించే అంశం కాదు..చంద్రబాబు ఎప్పుడైనా అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారా..ప్రత్యేక హోదా మీద అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే చంద్రబాబు చేశారా," అంటూ సజ్జల నిలదీశారు. " జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళలేదు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఆగుతారా," అంటూ సజ్జల ప్రశ్నించారు.