English | Telugu
భారత్ లో రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ త్వరలో..!
Updated : Sep 7, 2020
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రష్యా వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ భారత్ లో ఈనెలలోనే ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి రష్యా డైరక్ట్ ఫండ్స్ హెడ్ కిరిల్ డిమిట్రి ఒక ప్రకటన చేస్తూ సౌదీ అరేబియా, ఫిలిప్పైన్స్ తో పాటు భారత్, బ్రెజిల్ లో త్వరలో స్పుత్నిక్-v వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ స్టార్ట్ అవుతాయని ప్రకటించారు.
వ్యాక్సిన్ కు సంబంధించిన ముఖ్యమైన డేటాను రష్యా ఈరోజు భారత్ కు అందించిన నేపథ్యంలో భారత్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ కు అడ్డు తొలగిపోయినట్లే. అయితే ఈ ట్రయల్స్ కు సంబంధించిన ఫలితాలు మాత్రం అక్టోబర్ నవంబర్ మధ్యలో వెల్లడి కావచ్చని తెలుస్తోంది.