English | Telugu
చైనా దురాక్రమణ పై లడాఖ్ ప్రజలు అలా.. మోడీ ఇలా.. రాహుల్ ఫైర్
Updated : Jul 4, 2020
ఒకపక్క లడాఖ్ ప్రజలు తమ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుందని చెపుతుంటే.. మరో పక్క ప్రధాని మాత్రం మన భూభాగం లోకి ఎవ్వరు రాలేదని అంటున్నారని ఐతే ఈ ఇద్దరి లో ఎవరో ఒకరు అబద్దం ఆడుతున్నారని అర్ధమౌతోందన్నారు. ఇదే సమయంలో దేశభక్తులైన లడాఖ్ ప్రజలు చైనాకు వ్యతిరేకంగా నినదిస్తున్నారని రాహుల్ పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా అయన లడాఖ్ ప్రజలు చైనా వ్యతిరేక నినాదాలు చేస్తున్న వీడియోను షేర్ చేసారు. లడాఖ్ ప్రజల హెచ్చరికలు విస్మరిస్తే మన దేశానికీ తీవ్ర నష్టం జరుగుతుందని అయన తన ట్వీట్ లో హెచ్చరించారు. ఒక పక్క ప్రధాని మోడీ లడాఖ్ లోని సరిహద్దు ప్రాంతం లో ఉన్న సైనిక శిబిరాల వద్ద పర్యటన చేస్తున్న సమయంలో రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.