English | Telugu
విద్యార్థులకు శుభవార్త
Updated : Jul 4, 2020
కరోనా కారణంగా మూతబడిన స్కూల్స్ ఇంకా తెరుచుకోలేదు. విద్యాసంవత్సరం ఇప్పటికే ప్రారంభం కావల్సి ఉంది. కొన్నిచోట్ల ఆన్ లైన్ తరగతులు నిర్వహిస్తున్నా తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తోంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్య కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్(సీఐఎస్‌సీఈ).. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్(ఐసీఎస్‌ఈ), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్(ఐఎస్‌సీ) సిలబస్ ను 25 శాతం మేర తగ్గించింది. 2020-21 విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం అయ్యే సూచనలు ఉన్న నేపథ్యంలో సిలబస్‌ను 25 శాతం తగ్గించింది. సవరించిన సిలబస్ అధికారిక వెబ్‌సైట్ cisce.org లో లభిస్తుంది. అధికారిక వెబ్‌సైట్ నుండి 9 నుండి 12వ తరగతుల విద్యార్థులు తాజా సిలబస్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.