English | Telugu

రాఫెల్ విమానాలు.. రాహుల్ గాంధీ మూడు ప్రశ్నలు

ఫ్రాన్స్ నుంచి ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం భారత్‌ కు చేరిన విషయం తెలిసిందే. భారత్‌ కొనుగోలు చేసిన 36 యుద్ధ విమానాల్లో భాగంగా తొలివిడత ఐదు యుద్ధ విమానాలు హర్యానాలోని అంబాలకు చేరుకున్నాయి. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్పందించారు. రాఫెల్ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని మొదటి నుంచి వాదిస్తోన్న రాహుల్.. తాజాగా ట్విట్టర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మూడు ప్రశ్నలు సంధించారు.

ఒక్కో రాఫెల్‌ విమానం ఖర్చు రూ.526 కోట్ల నుంచి రూ.1670 కోట్లకు ఎందుకు పెరిగిందని ప్రశ్నించారు. అలాగే, 126 విమానాలకు బదులు, కేవలం 36 విమానాలనే ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. యుద్ధ విమానాల రూ.30,000 కోట్ల కాంట్రాక్టును దేశీయ సంస్థ అయిన హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్ఏఎల్) కు కాకుండా, దివాలా తీసిన పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి ఎందుకు ఇచ్చారని రాహుల్ ప్రశ్నించారు.