English | Telugu

విషజ్వరాల పేరుతో ప్రైవేటు ఆసుపత్రిలో మొదలవుతున్న కొత్త దందా...

అమ్మో జ్వరాలు అనేలా చేశాయి ఈ సీజన్ లో వచ్చిన విష జ్వరలు.నల్లగొండ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రిలో విషజ్వరాలను ఆసరాగా చేసుకుని భారీ దందాకు తెరలేపాయి. సాధారణంగా వచ్చే విష జ్వరాలను డెంగీ గా చూపుతో ప్లేట్ లెట్స్ పేరుతో అక్రమార్జనకు పాల్పడుతున్నారు కొందరు ప్రైవేటు ఆసుపత్రి అధికారులు. అవసరమున్నా లేకున్నా టెస్టుల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేయడమే కాక పేదల జేబుల ను గుల్ల చేస్తున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా వ్యాపిస్తున్న విషజ్వరాల ప్రైవేటు ఆసుపత్రు లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నల్లగొండ జిల్లాలో ఈ సీజన్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా విజృంభిస్తున్న విష జ్వరాలు దందాకు భారీ ఊతమిస్తున్నాయి. పారిశుధ్య లోపంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత ను సరిగ్గా పాటించకపోవడం తో దోమలు విపరీతం గా వ్యాపిస్తున్నాయి.

ఈ దోమకాటు వల్లనే ఈ సీజన్ లో నల్లగొండ జిల్లాలో ఎక్కువ మంది విషజ్వరాల బారిన పడుతున్నారు. మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ తో పాటు ప్రమాదకరమైన డెంగీ జ్వరాల కూడా ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. నల్లగొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా లో ఇప్పటి వరకు యాభై ఆరు డెంగ్యూ కేసులు ఇరవై ఐదు చికెన్ గున్యా కేసులు నమోదయ్యాయి. వీరి దృష్టికి రాకుండా ఉన్న వారి సంఖ్య భారీగానే ఉంటుందని అంచనాలు వెల్లువడుతున్నాయి. పలుచోట్ల డెంగీ మరణాలు కూడా సంభవించాయి అయితే వీటిని ప్రభుత్వ లెక్కల్లో డెంగీగా నమోదు చేయడానికి అధికారు లు నిరాకరిస్తున్నారు.జ్వరాల బారిన పడిన ప్రజల్లో కొందరు ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతుండగా వ్యాధి తీవ్రత ను బట్టి ఎక్కువ మంది ప్రైవేట్ ఆసుపత్రుల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇదే ప్రైవేటు ఆసుపత్రులకు అదునుగా మారుతోంది. ఒక పేషెంట్ తమ ఆసుపత్రి వచ్చాడంటే అతన్ని ఎలా పీల్చి పిప్పి చేయాలన్నా ముందస్తు ప్లాన్ చేసి ఆ ప్రకారంగా వైద్యం దశల వారీగా అందిస్తున్నారు. దీంతో పేషెంట్ కు ఖర్చు తడిసి మోపెడవుతుంది.

ముందుగా ప్రైవేటు ఆసుపత్రి కి వెళ్లిన పేషెంట్ లకు టెస్టుల్ లోనే అసలు పరీక్ష మొదలవుతుంది. గతంలో గుర్తింపు పొందిన ల్యాబ్స్ లో పరీక్ష లు నిర్వహిం చేవారు. కానీ ఇటీవల కొత్త గా ప్రైవేటు ఆసుపత్రుల్లో ల్యాబ్స్ ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు అందులో అర్హులైన టెక్నీషియన్స్ లేక పోయినా వైద్యుల పర్యవేక్షణ లో టెస్టుల రిజల్ట్స్ ఇస్తున్నారు. తమ ట్రీట్మెంట్ అమౌంట్ టార్గెట్ గా తప్పుడు రిపోర్టు లు రోగులకిస్తున్నారు. వీటిని ఆధారంగా చేసుకుని రోగులను భయబ్రాంతులకు గురి చేస్తూ తదుపరి చికిత్స లు చేస్తున్నారు. అవసరం లేని ట్రీట్మెంట్ చేస్తూ అత్యవసర చికిత్స పేరుతో ఐసీయూ లో పెట్టి అదనపు డబ్బు వసూలు చేస్తూ రకరకాల పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణ జ్వరం తో ఆసుపత్రి లో అడ్మిట్ అయితే కనీసం ఇరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఫీజును గుంజుతున్న ఆసుపత్రుల నల్లగొండ లో భారీగా పెరిగిపోయాయి.ఇక డెంగీ అనగానే ప్లేట్ లెట్స్ పేరుతో కొత్త తరహా దందాకు తెరలేపుతున్నారు. ఒక రోగికి సాధారణం గా ఒకటిన్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ప్లేట్ లెట్స్ ఉంటే సాధారణ స్థాయి లో ఉన్నట్టు లెక్క. కానీ ప్రైవేటు ఆసుపత్రుల్లో ని ల్యాబ్స్ లో రోగికి కావలసిన ప్లేట్ లెట్ కౌంట్ తక్కువ చూపుతూ అత్యవసర స్థితిని కృత్రిమం గా కల్పిస్తున్నారు. ప్లేట్ లెట్స్ పడిపోతే ప్రాణానికే ప్రమాదం అంటూ రోగిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఐసీయూ చికిత్స అందిస్తున్నారు. రోజు కు పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్లేట్ లెట్స్ ఎక్కించాలంటూ ఒక ప్యాకెట్ కు పదిహే ను వేల నుంచి ఇరవై వేల వరకు మరో రూపంలో వసూలు చేస్తున్నారు. కనీసం వారం రోజులు ఆసుపత్రి లో వుంచుకుని డబ్బు లు పిండేస్తున్నారు ఇలాంటి ఘటనే నల్లగొండ పట్టణం లోని డాక్టర్స్ కాలనీ లో చోటుచేసుకుంది.పట్టణాని కి చెందిన రూపక్ కుమార్ అనే వ్యక్తి సాయి శ్రీనివాస్ ఆసుపత్రుల్లో జ్వరం పేరుతో అడ్మిట్ కాగా ఆసుపత్రి ల్యాబ్ లో ప్లేట్ లెట్ కౌంట్ చాలా తక్కువ చూపారు.

అనుమానం వచ్చిన రోగి బంధువు లు బయట మరో ల్యాబ్ లు చేపిస్తే సాధారణం గా ఉండాల్సిన కౌంట్ ఉంది దీంతో వీరు డీఎంఅండ్ హెచ్ వోకు ఫిర్యాదు చేశారు రంగం లోకి దిగిన డీఎంఅండ్ హెచ్ వో ఏ కొండలరావు సాయి శ్రీనివాస్ ఆసుపత్రి ని తనిఖీ చేస్తే అసలు బండారం బయటపడింది. ఆ ల్యాబ్ కు అనుమతి లేదని అందులో ఉన్న టెక్నీషియన్ కు అర్హత లేదని తేల్చి ల్యాబ్ ను సీజ్ చేశారు. ఇదే సందర్భం గా మరి కొన్ని ల్యాబ్స్ ను తనిఖీ చేయగా సాయితేజ డయాగ్నిస్టిక్ సెంటర్ లు కూడా ల్యాబ్ లు తప్పుడు నివేదిక ఇచ్చారని సీజ్ చేశారు. అధికారుల తనిఖీ ల విషయం తెలిసిన మరి కొన్ని ల్యాబ్స్ నిర్వహకులు వాటిని మూసి వేసి బయటకు వెళ్లిపోయారు. వాస్తవం గా డెంగీ నిర్ధారణ పరీక్ష అనేది జిల్లా లో ఎక్కడా ప్రైవేటు ఆసుపత్రుల్లో లేవని డీఎంఅండ్ హెచ్ వో కొండలరావు స్పష్టం చేస్తున్నారు. డబ్బుల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని అనవసరంగా సామాన్య ప్రజల ను దోచుకోవద్దు అని చెబుతున్నారు. ఇక జిల్లా లోని ప్రైవేట్ ఆసుపత్రు లు ల్యాబ్ లు పోయినా తమ దాడులు కొనసాగుతాయని డీఎంఅండ్ హెచ్ వో కొండలరావు హెచ్చరిస్తున్నారు.డెంగీ కి భయపడాల్సిన పని లేదని తగ్గు ముఖం పట్టే జ్వరమే ఉంటుంద ని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. చికిత్స తీసుకోవడం లో నిర్లక్ష్యం ఉంటే కానీ లేదంటే శారీరకంగా నీరసంగా ఉంటే తప్ప ప్రాణాపాయం ఉండదని ప్రభుత్వ వైద్యు లు చెబుతున్నారు. విషజ్వరాలు వచ్చినపుడు సాధారణంగా ప్లేట్ లెట్స్ తగ్గిపోతుంటాయని మళ్లీ సాధారణ వైద్యం తోనే వాటంతట అవే పెరుగుతూ వస్తాయంటున్నారు వైద్యనిపుణులు.