English | Telugu
ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర హోంశాఖ భేటీ...
Updated : Oct 10, 2019
ఏపీ ప్రభుత్వం మరి కాసేపట్లో హోం మంత్రితో చర్చలు జరపనున్నారు. .ఏపీ తెలంగాణ రాష్ట్రాల విభజన అంశాల పై కేంద్ర హోంశాఖ రెండు రాష్ట్రాలతో ఈ సాయంత్రం సమావేశం ఏర్పాటు చేసింది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరవుతారు. విభజన చట్టం లోని తొమ్మిది, పది షెడ్యూళ్లలో ప్రస్తావించిన ప్రభుత్వ సంస్థలూ ఆస్తులు, ఉద్యోగుల విభజన పై సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ ఇంకా తీసుకోవాల్సిన చర్యల గురించి రెండు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి సమీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇప్పటికే అపరిష్కృతంగా ఉన్న అంశాల మీదనే ప్రధానంగా ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రట్రీలు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో చర్చిస్తున్నారు. ఇప్పటికీ షడ్యూల్ తొమ్మిది, పది ఆ రేండు ఇన్స్ ట్యూషన్స్లో పొందుపరచిన , సంస్థల విభజన, ఆస్తుల విభజన, ఆ సంస్థల ఉద్యోగుల విభజన కూడా కొలిక్కి రావాల్సింది. దానితో పాటు రాష్ట్రం వెలుపల కలిగినా ఉమ్మడి ఆస్తుల పంపకాలు కూడా జరగాల్సి ఉంది.
అందులో ఢిల్లిలో ఉన్న ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ భవనం కూడా ఒకటి. ఇలాంటివి ఇంకా పెండింగ్ లో ఉన్న అంశాల మీద ఈ సమావేశం చర్చ జరగనున్నది. ఈ సమస్యలకు సానుకూల పరిష్కారంమే ఈ సమావేశ ముఖ్య ఉద్దశమని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య లేకపోవడం కారణంగా కొన్ని అంశాల్లో ఒక ఏకాభిప్రాయం రాలేదు కానీ ఇప్పుడు పలు పర్యాయాలు కూర్చుని సమావేశాలల్లో అనేక విషయాల్లో ఏకాభిప్రాయానికి వచ్చారు.ఇరు రాష్ట్రాల మంత్రులు ఈ సమావేశంలో భాగంగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీలు కేంద్ర హోం శాఖ దగ్గర కూర్చుని ఎలా పంచుకోవాలి, ఎలా ఏ విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది.కేంద్ర హోంశాఖ చెప్పడం ద్వారా ఈ ఆస్తుల పంపకాలు కానీ ఉద్యోగుల పంపకాలు కానీ ఆ విభజన చట్టం లో పొందు పరిచిన వాయుదా పడ్ద అంశాల్ని కూడా వీలైనంత త్వరగా పరీష్కరించుకోవాలనే ఉద్దేశం తో ఈ సెక్రటరీల సమావేశం జరుగుతుంది. ఇప్పటికైన ఈ సమావేశంతో ఆ వాయిదాకేసులు ఓ కొలిక్కి వస్తాయో లేదో వేచి చూడాలి.