English | Telugu

గర్భం తో ఉన్న ఏనుగు ఘటన మరిచిపోక ముందే.. తాజాగా ఆవు

కేరళ లోని పాలక్కాడ్ లో గర్భం తో ఉన్న ఏనుగు కు ఆహారంగా క్రాకర్స్ నింపిన పైన్ ఆపిల్ ఇచ్చి దాని ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. దీని పై సెలబ్రిటీల దగ్గరనుండి సామాన్యుల వరకు తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా గర్భంతో ఉన్న ఆవు పై ఇదే తరహాలో దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లోని జాందూత ప్రాంతంలో గర్భంతో ఉన్న ఓ ఆవు పై ఇదే తరహా ప్రయోగం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ అవుకు పెట్టిన గోధుమ పిండి ముద్దలో క్రాకర్స్ పెట్టటం తో ఆ పేలుడు ధాటికి ఆవు దవడలు మొత్తం పగిలిపోయి, నోటి నుంచి వేలాడుతున్నాయి. దాని నోటిలో బాంబు పేలడం తో ఏమి తినలేని తాగలేని పరిస్థితుల్లో ఆ ఆవు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి స్థానికంగా వైరల్ గా మారింది. ఆ ఆవు యజమాని గురుదయాళ్ సింగ్ కథనం ప్రకారం ఆయన ఇంటి పొరుగున ఉన్న నందలాల్ అనే వ్యక్తి ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.ఈ దాడి జరిగిన తరువాత నందలాల్ పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు.