English | Telugu
కరోనా సంగతేమో, పోలీసు దెబ్బే చుక్కల్ని చూపిస్తుంది!
Updated : Apr 2, 2020
నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. కన్న కొడుకు ముందు లాఠీలతో బాదుతున్న దృశ్యం హ్రుదయ విదారకంగ ఉంది.
వనపర్తిలో ఓ వ్యక్తిపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారు. నిబంధనలను ఉల్లంఘించారన్న నెపంతో ఓ వ్యక్తిని కన్న కొడుకు ముందే చితక బాధారు. లాఠీలతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ పరుష పదజాలం వాడారు. ఐదారుగురు పోలీసులు ఒక వ్యక్తిని చుట్టుముట్టి కింద పడేసి మరీ దారుణంగా హింసించారు. ఆ వ్యక్తి కొడుకు వదలండి అంకుల్ ఫ్లీజ్ అంటున్నా ఏ మాత్రం కనికరించలేదు.
ఆ వ్యక్తితోపాటు ఆ పిల్లాన్ని కూడా పోలీసు వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. దురుసుగా ప్రవర్తిస్తూ.. నోటికి వచ్చిన బూతులు తిడుతూ.. ఆ పిల్లాడితో సహా ఇద్దరిని అరెస్టు చేసి కారులోకి నెట్టి తీసుకెళ్లారు. ఈ ఆక్రందనలను అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
కొంతమంది పోలీసుల ప్రవర్తనతో మిగతా పోలీసులంతా బదనాం అవుతున్నారు. అమాయక ప్రజలపై జులుం చేసే వారికి గుణపాఠం నేర్పేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ నిర్ణయం ఏమిటో?