English | Telugu
భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
Updated : Nov 28, 2020
భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ తయారీని వేగవంతం చేసేందుకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)తో కలిసి పని చేస్తోందన్నారు. స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు తనకు వివరించారని తెలిపారు. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్‌లో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి పట్ల ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పటికే ప్రధాని మోదీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జైడస్ బయోటెక్ పార్క్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారుకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు. హైదరాబాద్ పర్యటన అనంతరం మోదీ పూణే బయల్దేరారు. పూణేలోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను మోదీ సందర్శించనున్నారు.