ఈ రోజు రాత్రి ప్రధాని మోదీ భారత్ బంద్ ప్రకటించే అవకాశం. రాష్ట్రాలకు సీఆర్ఫీఎఫ్,ఆర్మీ బలగాలోచ్చే అవకాశం. భారత్ లో కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రధాని చేయబోయే ప్రకటన కీలకం కాబోతోందని తెలుస్తోంది. ముంబైలో మూడుకు చేరిన మృతుల సంఖ్య. నిన్న సాయంత్రం ప్రాణాలు కోల్పోయిన 65 ఏళ్ల వ్యక్తి. భారత్ లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తోంది. ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఈరోజుకు దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు 446కి చేరుకున్నాయి. నిన్న ఒక్క రోజే 99 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 9 మంది ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ముంబై నగరంలో ముగ్గురు మరణించారు. నిన్న సాయంత్రం 65 ఏళ్ల వ్యక్తి చనిపోయారు. ఈయన ఈనెల 15న యూఏఈ నుంచి అహ్మదాబాద్ వచ్చారు. మార్చి 20న అక్కడి నుంచి ముంబైకి వచ్చారు. కరోనా లక్షణాలతో ఉన్న ఆయనను కస్తూర్బా ఆసుప్రతిలో చేర్చారు. చికత్స పొందుతూ ఆయన నిన్న సాయంత్రం చనిపోయారు.
ఈ పరిస్థితులన్నింటి నేపథ్యంలో , ప్రధాని ఈ రాత్రి చేయబోయే ప్రసంగం లో వచ్చే నెలాఖరు వరకూ నేషనల్ లాక్ డౌన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే దేశం లోని అన్ని రాష్ట్రాల నుంచి, ఆయా రాష్ట్రాల్లో ఉన్న మిలిటరీ బలగాల లెక్కల్ని కేంద్రం అడిగి తీసుకున్నట్టు సమాచారం.