English | Telugu
చిరిగిన బట్టలతోనే ఉద్యమం చేయాలా? అమరావతికే తన మద్దతన్న పవన్
Updated : Nov 18, 2020
అమరావతి పరిరక్షణ సమితి నేతలతో మరోసారి సమావేశమయ్యారు పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని తనకు బీజేపీ స్పష్టం చేసిందని చెప్పారు. అలాగే రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం కూడా అధికారికంగా చెప్పలేదన్నారు. రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తే తమ పార్టీ కార్యాచరణ వెల్లడిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.