English | Telugu
జంక్షన్ లో జనసేన!
Updated : Mar 12, 2020
అవును...వారి ముగ్గురు పేర్లు ఖరారయ్యాయి....ఇక జంక్షన్ లోనే జనసేన .....
వారి ముగ్గురి పేర్లూ ఖరారయ్యాయట. తాడేపల్లి లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి అందుతున్న సమాచారం ఇది. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే నందిగం సురేష్ లకు కేంద్ర క్యాబినెట్ లో బెర్తులు ఖాయమని, రాజ్య సభ ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే, తెలుగు వారి నూతన సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఏ క్షణమైనా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ ఉండవచ్చునని, ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కు, ప్రధాని అధికార నివాసం 7, రేస్ కోర్సు రోడ్డు నుంచి సమాచారం కూడా వెళ్లిందని భోగట్టా. ఇదే జరిగితే, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి అని జన సేన లో బెంగ మొదలైంది. పవన్ ఆటలో అరటి పండేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎన్నికల సమరం ముగిసే వరకూ క్యాబినెట్ లో వై ఎస్ ఆర్ సి పి చేరికపై ఎలాంటి ప్రకటన చేయవద్దని బీ జీ పి పెద్దలు ఇప్పటికీ జగన్ హెడ్ క్వార్ట్రర్స్ కు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత, పవన్ కళ్యాణ్ ప్రయాణం ఎలా ఉంటుందనేది ఆయనే చెపుతారని, అలాంటప్పుడు తొందరపడి ప్రకటనలు చేయకుండా ఉండటమే సబబని వై ఎస్ ఆర్ సి పి సీనియర్లు చెపుతున్నారు.
నిజానికి, ఇప్పటికే ఏపీ అధికార పార్టీ వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం ఖాయంగా కనిపిస్తోంది.పార్టీ నుండి రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలో బీజేపీలోని కొందరు ముఖ్యులు ఈ అంశాన్ని చర్చించారనే సమాచారం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రిని కలిసిన సమయంలోనే ఈ నిర్ణయం ఖరారైందని తెలుస్తోంది.
అయితే, ఏపీలో జనసేన తో మైత్రి కొనసాగిస్తున్న బీజేపీ.. ఇప్పుడు తమ వైసీపీని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారనే సమాచారం పవన్‌కు షాక్ గా భావిస్తున్నారు. అదే జరిగితే పవన్ బీజేపీతో సైతం దూరం అవ్వటం ఖాయమని తెలుస్తోంది. అసలు ఇంతకీ..ఈ మొత్తం వ్యవహారంపైన ఢిల్లీలో ఏం జరుగుతోంది...వైసీపీ నుండి ఎవరికి అవకాశం దక్కనుంది..
2014 ఎన్నికల తరువాత టీడీపీ..బీజేపీతో పొత్తు..తరువాతి పరిణామాలతో రాజకీయంగా టీడీపీ నష్టపోయిన విధానంతో తాము జాగ్రత్తగా ఉండాలని తొలుత వైసీపీ భావించింది. అయితే, స్వయంగా బీజేపీ పెద్దల నుండే కేంద్ర కేబినెట్ లో చేరాలని ఆహ్వానం వచ్చినా..ముఖ్యమంత్రి జగన్ సమయం కావాలని కోరినట్లు తెలిసింది. ఇక, ఇప్పుడు అటు జాతీయ స్థాయిలో..ఇటు ఏపీలో మారుతున్న సమీకరణాలతో కేంద్ర కేబినెట్ లో చేరాలనే ప్రతిపాదన స్వయంగా కేంద్రంలో రెండో స్థానంలో ఉన్న నేత నుండి ముఖ్యమంత్రికి అందినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే, ఎన్‌ఆర్‌సీ..ఎన్‌పీఆర్ వంటి అంశాల్లో తొలుత పార్లమెంట్‌లో సమర్ధించినా..ఇప్పుడు ఏపీలో అమలు చేయమని జగన్ స్పష్టం చేశారు. ఇక, ఇదే సమయంలో ఏపీలో పవన్ తో బీజేపీ జత కట్టటంతో వైసీపీలో ఆలోచన మారినట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఆర్దిక పరిస్థితులు..అనివార్యంగా మారిన కేంద్ర సాయం..ఇతరత్రా సమస్యలతో కేంద్ర కేబినెట్ లో చేరటం వలనే నష్టం లేదనే అభిప్రాయంతో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల పవన్ కళ్యాణ్ క్యాంప్ లో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. బీ జె పి తో స్నేహం మొదలెట్టి రెండు నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఉత్పాతమేమిటని జన సైనికులు గొణుక్కుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ఆంధ్ర ప్రదేశ్ లో జత కట్టడానికి జన సేన కు మిగిలి ఉన్నది తెలుగు దేశం లేదా కాంగ్రెస్ పార్టీలు..అది కూడా ఆ రెండు పార్టీలు ఆంద్ర చేగువేరా ని స్వాగతిస్తేనే ...... వారెవ్వా...పాతికేళ్ల రాజకీయం ప్రామిస్ ఒకే దగ్గర పట్టుమని రెండు నెలలు కూడా ఉండలేకపోవడమేమిటి? చిత్రం కాకపోతేనూ.....