English | Telugu

రాహుల్ కు బలహీన అలవాటు! ఒబామా పుస్తకంలో సంచలనాలు

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన కొత్త పుస్తకంలో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. తనకు ఎదురైన స్వియ అనుభవాలతో పాటు అమెరికా వ్యవహారాలను తన పుస్తకం 'A Promised Land'లో పొందు పరిచారు బారక్ ఒబమా. భారత్ గురించి, మన దేశ రాజకీయ నేతల గురించి కూడా తన అభిప్రాయాలు రాశారు. ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నేతల గురించి కూడా ఒబామా తన మనోగతాన్ని పుస్తకంలో వెల్లడించారు.

న్యూయార్క్ టైమ్స్ సమీక్షించిన ఈ పుస్తకంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు బారక్ ఒబామా. "రాహుల్ గాంధీకి ఒక బలహీనమైన అలవాటు ఉంది. అతను కోర్సు మొత్తం పూర్తి చేసి, టీచర్‌ను ఆకట్టుకోవాలని ఎదురుచూస్తుంటాడు. కానీ, లోతుగా విషయం నేర్చుకునేందుకు అవసరమైన అభిరుచి గానీ, అసక్తి గానీ ఉండవు." అని ఒబామా రాసుకొచ్చారు.

సోనియా గాంధీపై కూడా తన పుస్తకంలో బారక్ ఒబామా ప్రస్తావించారు. "చార్లీ క్రిస్ట్, రహమ్ ఇమాన్యుయేల్ వంటి పురుషుల అందం గురించి మనకు చెప్పబడింది. కానీ మహిళల అందం గురించి చెప్పలేదు. ఒకటి.. రెండు.. సందర్భాల్లో మినహా సోనియా గాంధీ విషయంలో కూడా అదే జరిగింది." అని చెప్పారు. అమెరికాకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఒబామా 2010, 2015లో రెండుసార్లు భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో భారత్ కు తనకు ఎదురైన విషయాలను పుస్తకంలో వెల్లడించారు అమెరికా మాజీ అధ్యక్షుడు. తన భారత పర్యటనలోనే సోనియా, రాహుల్ గాంధీలను కలిశారు ఒబామా. అప్పుడు గమనించిన విషయాల ఆధారంగా వారిద్దరిపై తన అభిప్రాయాన్ని బారక్ పుస్తకంలో రాశారని భావిస్తున్నారు.