English | Telugu

పి.ఎం, సి.ఎంల‌కే పౌర‌స‌త్వ ఆధారాలు లేవ‌ట‌!

అవును. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం వివాదస్పదంగా మారిన నేపధ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. దేశంలో తొలిసారి కులం ఆధారంగా పౌరసత్వం ఇవ్వబోతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు ప్ర‌ధాని మోదీకి, హ‌ర్యానా ముఖ్య‌మంత్రికి పౌర‌స‌త్వ ఆధారాలున్నాయా అంటూ ఆర్ టి ఐ దాఖ‌లైంది.

అయితే, ప్ర‌ధాని మోడీ కి పౌరసత్వం ఉందా అని RTI ద్వారా సమాచార ఆడిగితే PMO నుండి వచ్చిన సమాధానం ఆస‌క్తిక‌రంగా వుంది.

ఏది క్లియర్ గా చెప్పలేకపోయారు, మోదీకి సంబంధించిన ఆధారాలు రిజిస్ట్రేషన్ అయ్యి లేవు కానీ, ఇండియా లో నే జన్మించారు కాబట్టి పౌరుడే అని స‌మాధానంలో ఆర్ టి ఐ అధికారులు వెల్ల‌డించారు.

బీజేపీకి చెందిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌, అతని కేబినెట్ మంత్రుల పౌరసత్వాన్ని నిరూపించే ఆధారాలపై మ‌రో ఆర్ టి ఐ దాఖ‌లైంది.

అస్సాంలో మాదిరిగానే హర్యానాలో తమ ప్రభుత్వం ఎన్.ఆర్.సి ని అమలు చేస్తుందని ఇటీవల నేవీ చీఫ్‌ అడ్మిరల్ సునీల్ లాంబ, రిటైర్డ్ హైకోర్ట్ జడ్జీ హెచ్.ఎస్. భల్లాలతో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ ప్రకటన చేయడంపై విశేషం.

ఈ నేప‌థ్యంలో పానిపట్ కు చెందిన ఓ ఆర్టీఐ కార్యకర్త పి.పి కపూర్ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్, అతని ప్రభుత్వంలోని మంత్రులు, గవర్నర్ సత్యదేవ్ నారాయణ్‌ ఆర్య ల పౌరసత్వానికి సంబంధించిన ఆధారాలను ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం కింద జనవరి 20 న దరఖాస్తు చేశారు.

అయితే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్‌, అతని కేబినెట్ మంత్రుల పౌరసత్వాన్ని నిరూపించే ఎలాంటి రికార్డ్స్ లేవని ప్రజా సమాచార అధికారి పూనమ్ రతి స‌మాధానం పంపించారు.

అది సంగ‌తి. ఇన్ని రోజులుగా జనం చెప్పేది అదే. మేమంతా ఇక్కడే పుట్టిపెరిగామని.