English | Telugu
నిమ్మగడ్డ కేసులో అనూహ్య పరిణామం.. పాస్‍వర్డ్ లీక్ పై సీజే ఫైర్
Updated : Apr 29, 2020
దీంతో, నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ పిటిషన్‍పై విచారణ సోమవారానికి వాయిదా వేసారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని, నేరుగా కోర్టులోనే విచారణ చేస్తామని, సీజే చెప్పారు. కోర్టుతో సంబంధమున్న న్యాయవాదులకు పాసులు జారీ చేసేలా డీజీపీకి ఆదేశాలు ఇస్తాం అని అన్నారు. కొంత మంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావాల్సి ఉండటంతో, సీజే దీనికి సంబంధించి డీజీపీకి లేఖ రాస్తాం అని చెప్పారు. సోమవారం అందరూ సమాజీక దూరం పాటిస్తూ, నిబంధనులు పాటిస్తూ, కోర్ట్ కు హాజరు కావాలని చెప్పారు. అయతే, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పాస్‍వర్డ్ లీక్ ఎలా అయ్యింది, ఎవరు ఆ వీడియో కాన్ఫరెన్స్ లోకి వచ్చారు అనేది తెలియాల్సి ఉంది. బయట వ్యక్తులు ఎలా వస్తారు అంటూ, చర్చ మొదలైంది.
నిన్న, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమి షనర్ తొలిగింపు అంశం పై కేసు విచారణను ఈ రోజుకి హైకోర్టు వాయిదా వేసింది. ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ప్రభుత్వం నూతన సంస్కరణల సాకుతో ఆర్డినెన్స్ ద్వారా తొలిగించింది అంటూ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై నిమ్మగడ్డ వ్యక్తిగతంగాను, మాజీ మంత్రి కామినేని శ్రీనివాతో పాటు ఆరు గురు ప్రజావ్యాజ్య పిటిషన్లును హైకోర్టులో దాఖలు చేసారు. ఈ పిటీషన్లకు సంబంధించి ఫిర్యాదుదారులు, ప్రభుత్వం, రాష్ట్ర ఎన్ని కల సంఘం కౌంటర్లు దాఖలు చేశాయి. ఈ కేసుకు సంబంధించి మంగళవారం వాద, ప్రతివాదనలు కొనసాగాయి. ధర్మాసనానికి ఆరుగురు వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది.