English | Telugu

రంగంలోకి గౌహతి ఐఐటీ

IIT గౌహతి కూడా covid 19 వాక్సిన్ ను కనిపెట్టే యజ్ఞంలో నిమగ్నమై ఉంది. ఇందుకోసం ఆ సంస్థ Hester biosciences LTD తో చేయి కలిపింది. అయితే తమ పరిశోధన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, డిసెంబర్ నాటికి జంతువులపై ప్రయోగం చేసే దిశగా ముందుకు సాగుతున్నామని గౌహతి ఐఐటీ బయోసైన్స్స్ , బయో ఇంజనీరింగ్ శాఖలకు చెందిన ప్రొఫెసర్ సచిన్ కుమార్ చెప్పారు.

తమ బృందానికి గతంలో క్లాసికల్ స్వైన్ ప్లూ,జపనీస్ ఎన్సఫిలిటిస్ లకు వాక్సిన్ కనుగొన్న చరిత్ర ఉందని ఆయన తెలిపారు. IIT డైరెక్టర్ టీ. జీ.సీతారామన్ మాటాడుతూ తాము ఖచ్చితంగా విజయం సాధించగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అంతే గాక ఇలాంటి పరిశోధనలు ఇక్కడితో ఆగవని,భవిష్యత్తులో దాడికి పొంచి ఉండే వైరస్ లను మొగ్గలోనే తుంచేసేందుకు ఇవి పునాదిగా ఉపయోగ పడతాయని అన్నారు.