English | Telugu

ఆధార్ కార్డు.. గొడుగు.. మాస్క్ ఉంటేనే మద్యం!

ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్ర‌భుత్వం సూచనలు మేరకు మద్యం అమ్మకాలు చేపట్టింది. ఏ మద్యం దుకాణం ముందు చూసినా బారులు తీరిన మందుబాబులే కనిపిస్తున్నారు. మండు టెండలను సైతం లెక్కచేయకుండా మందుబాబులు దుకాణాల ముందు బారీ క్యూ లైన్లలో నిలబడ్డారు. కొంత మంది భౌతిక దూరం పాటించకపోవడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

ఈ నేపథ్యంలో ఏపీలోని తెనాలి సీఐ హరికృష్ణ మందుబాబులకు కొత్త నిబంధనలు పెట్టారు. ఆధార్ కార్డు, గొడుగు ఉంటేనే మద్యం అమ్ముతారంటూ స్పష్టం చేశారు. గొడుగు ఉండడం వల్ల కచ్చితంగా ఒకరి నుంచి మరొకరు ఎడంగా ఉంటారని, దానికి తోడు ఎండ బారి నుంచి రక్షణగా ఉంటుందని, ఇక, ఇతర ప్రాంతాల నుంచి మద్యం కోసం వస్తుండడంతో విపరీతమైన రద్దీ ఏర్పడుతుందని వారిని కనుగొనేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. అలాగే మాస్క్ కూడా ఉండాలని నిబంధనలు విధించారు.