English | Telugu

కిమ్ భార్య పోరు త‌ట్టుకోలేక అదృశ్య‌మైయ్యాడ‌ట‌!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 20 రోజుల పాటు కనిపించకుండా పోయారు. ఆపై బయటికి వచ్చారు. ఓ ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కిమ్ రిబ్బన్ కట్ చేశాడు. ఇంత‌కీ కిమ్ ఎందుకు క‌నిపించ‌కుండా పోయాడ‌నే విష‌యంపై ర‌క‌ర‌కాల వార్త‌లొస్తున్నాయి.

అమ్మాయిల పిచ్చి బాగా వున్న కిమ్ ఏ దేశం వెళ్ళిన సరే అక్క‌డి అందమైన అమ్మాయిలతో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాడు. అయితే తన కేబినేట్‌లో ఉండే ఒక అందమైన అమ్మాయితో కిమ్ ప్రేమలో పడ్డాడట. అమ్మాయికి పెళ్లి అయింది.

దేశ ద్రోహం కేసులో ఆమె భర్తకు జైలు పంపి ఆమెతో పాటు పాంగ్యాంగ్‌కి దగ్గరగా ఒక చిన్న రిసార్ట్ లో ఎంజాయి చేయ‌డానికి వెళ్ళాడ‌ట‌. ఈ విష‌యం తెలుసుకున్న కిమ్ భార్య గుర్రుగా వుంది. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కిమ్ భార్యకు నచ్చజెప్పే పనిలో ఉండి బయటకు రాలేదట‌.