English | Telugu

'బాబు టైలర్స్‌... జగన్‌ టైలర్స్‌' అంటూ ఆసక్తికర కార్టూన్లు పోస్ట్ చేసిన నారా లోకేశ్

బీసీలపై జగన్‌ తీరుపై లోకేశ్‌ ఎద్దేవా
వైఎస్‌ జగన్ గారు మంచి కటింగ్ మాస్టర్
చట్టబద్ధంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్
34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్

'బాబు టైలర్స్‌.. జగన్‌ టైలర్స్‌' అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆసక్తికర కార్టూన్లు పోస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్లపై జగన్‌ తీరును ఎద్దేవా చేశారు. కార్టూన్లలో టైలర్లుగా చంద్రబాబు, జగన్‌ కనపడుతున్నారు. దుస్తులు కుట్టించుకోవడానికి బీసీలు వచ్చినట్లు దీన్ని గీశారు.

'వైఎస్‌ జగన్ గారు మంచి కటింగ్ మాస్టర్. చట్టబద్ధంగా బీసీలు అనుభవిస్తున్న 34 శాతం రిజర్వేషన్లను 10 శాతం కట్ చేసి 24 శాతానికి తగ్గించారు. రాజకీయంగానూ, సామాజికంగానూ, ఆర్థికంగానూ బీసీలను దెబ్బతీస్తూ... ఇప్పుడు 34 శాతం రిజర్వేషన్లు పార్టీపరంగా అమలు చేస్తున్నాం అని కటింగ్ ఇస్తున్నారు' అని లోకేశ్‌ చెప్పారు.