English | Telugu
పట్టాలెక్కుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ! భూసేకరణకు మహా సర్కార్ లైన్ క్లియర్
Updated : Dec 28, 2020
భూసేకరణకు ఇంతకాలం సహకరించని మహారాష్ట్ర సర్కార్ కూడా క్రమంగా దిగొస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే నాలుగు నెలల్లోనే 80% భూసేకరణ పనులు పూర్తిచేసేలా మహారాష్ట్ర ప్రభుత్వం.., కేంద్రానికి హామీ ఇచ్చినట్లు వీకే యాదవ్ తెలిపారు. ఆ సమస్య తీరగానే మహారాష్ట్రలోనూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాయల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దేశంలోనే తొలి అత్యంత భారీ బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఎల్ అండ్ టీ మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకొని దేశంలోనే అతిపెద్ద సివిల్ కాంట్రాక్ట్‌గా ఇది రికార్డ్ సృష్టించింది.