English | Telugu
సూర్యాపేటలో దారుణం.. మైనర్ బాలికపై మారు తండ్రి అత్యాచారం
Updated : Dec 5, 2019
సూర్యాపేటలో దారుణం జరిగింది. మైనర్ పై మారు తండ్రి అత్యాచారానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.ఆ బిడ్డ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడికి మరణ శిక్ష విధించాలంటూ బాధితులు కోరుతున్నారు. సూర్యాపేట కు చెందిన ఓ మహిళ భర్త పదేళ్ల కిందట చనిపోయాడు. తన ఇద్దరు కుమారులు కుమార్తెతో కలిసి ఆమె డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నివసిస్తొంది. ఆ తర్వాత ఆమెకు చివ్వెంల మండలం మున్యానాయక్ తండాకు చెందిన బాణోతు శ్రీను పరిచయమయ్యాడు. అతన్ని ఆమె రెండో పెళ్లి చేసుకుంది. వరుసకు కూతురయ్యే బాలిక పై కన్నేసిన శ్రీను ఆమెను లైంగికంగా వేధించసాగాడు. తల్లి కూలి పనులకు వెళ్లిన సమయంలో బాలిక పై అత్యాచారం చేశాడు. తల్లితో చెబితే చంపేస్తానంటూ బెదిరించ సాగాడు. దీంతో విషయం తల్లికి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయింది ఆ బాలిక. ఈ విషయాన్ని అలుసుగా తీసుకున్న శ్రీను బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. మారు తండ్రి పెట్టిన చిత్ర హింసలు భరించ లేక బాలిక విషయాన్ని తల్లితో చెప్పింది. దాంతో ఆమె తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడు శ్రీనును కఠినంగా శిక్షించాలని కోరుతోంది.