English | Telugu

చేతులెత్తి నమస్కరిస్తున్న మ‌రో వారం ఇంట్లోనే ఉండండి!

కరోనా వైరస్ తదనంతర లాక్ డౌన్ చర్యలకు జిల్లా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారని అధికారుల కృషి అభినందనీయం గా ఉన్నదని తెలంగాణా రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.

మార్చి 1 నుండి ఇప్పటివరకు 3480 మంది ఇతర దేశాల నుండి నిజామాబాద్ జిల్లాకు వచ్చారని వారందరినీ వారి ఇండ్లలో ఏకాంతంగా ఉంచడం ద్వారా 14 రోజులు పూర్తయిన వారిలో 2,200 మంది ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఉన్నారని అదేవిధంగా మరో వారం రోజుల్లో మిగతా 1200 మంది కూడా 14 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తిచేసుకుని సంతోషంగా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు ఇందుకు సహకరించిన వీరందరిని కూడా అభినందిస్తున్నానని అండగా నిలిచిన వారి కుటుంబ సభ్యులను కూడా అభినందిస్తున్నానని తెలిపారు.

ఈ విపత్కర పరిస్థితిని అధిగమించడానికి వీఆర్ఏ నుండి జిల్లా కలెక్టర్ వరకు, హోంగార్డు నుండి పోలీస్ కమిషనర్ వరకు, ఆశా వర్కర్ నుండి డిఎంఅండ్హెచ్ఓ వరకు చేసిన కృషి చాలా గొప్పది అన్నారు. అయితే ఈ వారం రోజులు కూడా క్వారంటైన్ లో ఉన్నవారు ఇదే సహకారంతో ఇండ్ల వద్దనే ఉండాలని అధికారులు కూడా ఇప్పటి వరకు లాగే స్ఫూర్తిని కొనసాగించి మనమంతా మన కుటుంబ సభ్యులంతా ఈ కరోనా వైరస్ బారి నుండి బయటపడడానికి కృషి చేయాలన్నారు.