English | Telugu

వైరస్ కట్టడికి పకడ్బందీగా పనిచేస్తున్నాం!

కరోనా వైరస్ కట్టడికి దేశంలో పకడ్బందీగా పని చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట కోరింది తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది తెలంగాణ.
మర్కజ్ గురించి కూడా కేంద్రానికి సమాచారం అందించింది కూడా తెలంగాణనే అని మంత్రి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

వెయ్యికి పైగా మంది మర్కజ్ కి వెళ్లినట్లు తెలిసింది. 160 మందిని తప్ప అందరినీ గుర్తించాం. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించి, పరీక్షలు చేయిస్తున్నాము అంటే తెలంగాణ ప్రభుత్వం సత్తా, చిత్తశుద్ది అర్దం చేసుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రం లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పోసిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నెగెటివ్ వచ్చింది. మరో సారి పరీక్ష చేసి డిశ్చార్జ్ చేస్తాం. ఈ రోజు మరో ఇద్దరు గాంధీ నుండి డిశ్చార్జ్ అవుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

డిశ్చార్జ్ అయిన వారందరూ మరో 14 రోజులు హోమ్ క్వారంటిన్ లో ఉండాలని ఆయ‌న సూచించారు. ఇప్పటివరకు తెలంగాణ లో 6 గురు కరోనాతో చనిపోయారు.