English | Telugu

విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ 1 నుండి తెలంగాణలో ఆన్ లైన్ క్లాసులు 

మొన్న మార్చిలో కరోనా వ్యాప్తితో ప్రభుత్వాలు పాఠశాలలను మూసి వేసిన సంగతి తెలిసిందే. అయితే కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉండడంతో మళ్ళీ పాఠశాలలను తిరిగి తెరిచే పరిస్థితి కనిపించడంలేదు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1 నుండి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నట్లుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీని కోసం విద్యార్థులకు అందుబాటులో ఉన్న సదుపాయాలపై సర్వే చేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఐతే ఇంట్లో టీవీలు లేని విద్యార్థుల కోసం వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించామని ఆమె చెప్పారు.

అంతేకాకుండా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆన్ లైన్ క్లాసుల షెడ్యూల్ ను తయారు చేసినట్టు ఆమె తెలిపారు. దీని కోసం రోజుకు కేవలం మూడు గంటల పాటు మాత్రమే డిజిటల్ క్లాసులు ఉండాలని ఆమె ఆదేశించారు. అంతేకాకుండా విద్యార్థుల కళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ఒక్కో క్లాసును అరగంట నుంచి 45 నిమిషాల పాటు మాత్రమే నిర్వహించాలని చెప్పింది.

కరోనా కారణంగా విద్యార్థులు చదువు విషయంలో విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఆన్ లైన్ తరగతులను నిర్వహిస్తున్నట్లు మంత్రి సబిత ఇంద్రా రెడ్డి తెలిపారు. దీంతో తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర తమ పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించాలని ఆమె కోరారు. అయితే ఇప్పటికీ ఇంట్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు లేని వారికి మరి ప్రభుత్వం ఏవిధంగా సదుపాయాలు సమకూరుస్తుందో వేచి చూడాలి.