English | Telugu
గవర్నర్ తో సీఎం భేటీ
Updated : Aug 29, 2020
సచివాలయం నూతన సచివాలయం నిర్మాణం పై కూడా ముఖ్యమంత్రి గవర్నర్ కు వివరించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీవర్షాలు, ప్రాజెక్టుల్లో పెరిగిన నీటిసామర్ధ్యం, వరద సహాయ చర్యలపై చర్చించారు. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి ప్రారంభం కానున్న శాసనసభ, శాసనమండల సమావేశాల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కి భారత రత్న ఇవ్వాలని ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసే అంశాన్ని కూడా గవర్నర్ దృష్టికి ముఖ్యమంత్రి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై గవర్నర్ కు వివరించారు. గవర్నర్ ను కలిసిన సందర్భంగా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ కూడా ఉన్నారు.