English | Telugu

మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా

తెలంగాణలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ‌కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సోమవారం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. తనకు ఫోన్ చేయడానికి కానీ.. కలుసుకోవడానికి కానీ ప్రయత్నించవద్దని తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లోని ఉన్నానని, ఎవరు ఆందోళన చెందాల్సి పనిలేదన్నారు.