English | Telugu
కర్తవ్య నిర్వహణలో శ్రీరాముడే మనకు ఆదర్శం!
Updated : Apr 1, 2020
నవమి వేడుకలు ఇంట్లోనే చేసుకోండి. పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీ సీతారాముల కల్యాణం అర్చకుల వరకే పరిమితం చేయాలి. లోకరక్షణకై యింటి నుండే ఆ రాముడికి పూజలు చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
శ్రీరామనవమి వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు.
సామాజిక దూరమే మనకు ఇప్పుడు శ్రీరామరక్ష అని తెలంగాణా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
అటువంటి రక్షణ కొరకే శ్రీరామనవమి వేడుకలు ఇంటివద్ద మాత్రమే చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎటువంటి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో శ్రీరామనవమి వేడుకలు జరపడం నిషేధం అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని సహకరించాలని ఆయన కోరారు.
ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ వైరల్ గా మారి మానవాళి భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నందునే ఇటువంటి కఠోర నిర్ణయాన్ని అమలు పర్చాల్సి వస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
కర్తవ్యనిర్వహణలో శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శమని అటువంటి మహానియుడి అడుగు జాడల్లో పయనిస్తున్న మన ముందున్న కర్తవ్యం లోకరక్షణనే అన్నది గ్రహించాలని ఆయన ప్రజలకు విజ్ణప్తి చేశారు. శ్రీ సీతారాముల కల్యాణం అర్చకులకే పరిమితం చెయ్యాలని యావత్ తెలంగాణ ప్రజానీకం యింటి దగ్గర నుండే ఆ కల్యాణాన్ని వీక్షించాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి హితవుపలికారు.