English | Telugu

విశాఖ లో కరోనా రెండో స్టేజ్ కు చేరుకుంది

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ల నాని నేడు విశాఖలో పరిస్థితిపై నాని సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇప్పటికి మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో 7 పాజిటివ్ కేసులు నమోదు జరిగింది. 220 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా 168 మంది కి నెగెటివ్ వచ్చింది,మిగిలిన వారికి నివేదికలు కోసం వేచి చూస్తున్నాము. విశాఖ జిల్లా లో మూడు కేసులు నమోదు జరిగింది. విశాఖలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చేసిన సేవలు అభినందనీయం. ఎంత చేసిన ఇంకా అప్రమత్తం అవ్వాలి. లాక్ డౌన్ ప్రకటించినా ఇంకా ప్రజలు సహకారం ఇవ్వాలి. లాక్ డౌన్ విజయవంతం చేయాలి అప్పుడే వైరస్ వ్యాప్తి అడ్డుకోగలమన్నారు.

విశాఖ లో కరోనా రెండో దశలో అడుగు పెట్టింది.విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు వచ్చింది. మూడో దశలోకి రాకుండా విశాఖ వాసులు ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఉచిత రేషన్ ఇస్తున్నాము. వచ్చే నెల 4 వ తేదీ ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అన్నారు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని.

"విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలి,వారు గృహ నిర్బంధం లో ఉండాలి. సీతమ్మ ధార, అనకాపల్లి, గాజువాక, అల్లిపురం ప్రాంతాలు హై రిస్క్ లో ఉన్నాయి.విశాఖ లో 20 కమిటీలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు పనిచేస్తున్నారు. విశాఖలో 1472 మంది విదేశాల నుంచి నగరానికి వచ్చారు.వైద్య సిబ్బందికి మాస్కలు, పిపిఏ కిట్ లు అందుబాటులో ఉంచుతున్నాము. ఔట్ సోర్స్ ఉద్యోగులకు జీతాలు చెలిస్తాము.విదేశాల నుంచి వచ్చిన వారు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి గా పాటించాలనీ, " డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సూచించారు.

లాక్ డౌన్ ప్రకటించిన అనవసరంగా రోడ్ల పై తిరిగితే ఆ వాహనాలు సీజ్ చేస్తాం.ఈ సాయంత్రం నుంచి మరింత కఠిన ఆంక్షలు విధిస్తున్నామనీ చెప్పారు. ఫార్మా పరిశ్రమలు తక్కువ సిబ్బంది తో పని చేయాలి. మీడియా పై నియంత్రణ లేదు , పోలీస్ సిబ్బంది వారి విధులకు ఆటంకం కలిగించవద్దు.జివిఎంసి మరింత గట్టిగా పనిచేయాలి. రైతు బజార్ లను స్కూల్ గ్రౌండ్స్, పెద్ద మైదాన్లలో నిర్వహిస్తాం. నిత్యావసర వస్తువు ధరలు పెరిగితే వారిపై కేసులు పెడతా మన్నారు మంత్రి పేర్ని నాని.